13, మార్చి 2011, ఆదివారం

తాగుబోతు


అర్ధరాత్రయినా ఇంటికి రాని తాగుబోతు భర్త సతీష్ కోసం ఎదురు చూస్తుంది భార్య. ఇంతలో తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది, లోపలినుండే నిర్ధారణ కోసం అడిగింది.. ఎవరూ..సతీష్ ?..సతీష్ ?..అని.
బయటనుంచి సమాధానం రాలేదు.
కిటికీ ఓపెన్ చేసి చూసింది.సతీషే ఉన్నాడు బయట.సతీషేనా అనడిగితే అవుననని చెప్పరే..కోపంగా అడిగింది భార్య.
అప్పడినుండీ నేను తలూపుతూనే ఉన్నాను డార్లింగ్..చెప్పాడు సతీష్.


జేబు దొంగ


జేబు దొంగ ను కోర్టు లో న్యాయమూర్తి అడిగాడు-ఆరునెలల జైలు శిక్ష గానీ,లేదా మూడూ వేల రూపాయల జరిమానాగానీ... చెప్పు,రెండిట్లో ఏది చేస్తావ్?
జేబు దొంగ: జరిమానా కడతా సార్
న్యాయమూర్తి: ఇప్పుడే చేతి లోడబ్బులున్నాయామరి..?  
జేబు దొంగ: లేవుగానీ చిటికెలో తెస్తా ఓ అరగంట నన్ను అలా సెంటర్ దాకా వెల్లొచ్చేందుకు ఓకే అన్నారంటే....


24, ఫిబ్రవరి 2011, గురువారం

అసలు సంగతి


భర్త:ఎవరైనా మొదట పిల్లలకు మాటలు నేర్పేటప్పుడు అమ్మ..అమ్మ.. అని పలికిస్తారు కానీ నువ్వేంటి నాన్న..నాన్న.. అని నేర్పిస్తున్నావ్? నేనంటే నీకెంత ప్రేమే..
భార్య:అవునండీ
కొన్నిరోజుల తర్వాత...
పాప అర్దరాత్రి నానా...అంటూ   ఏడుస్తోంది,భార్య,భర్త లకు మెలుకువ వచ్చింది.ఏవండీ పాప మిమ్మల్నే పిలుస్తోంది.కాస్త చూడండి.అంది భార్య